Karthika Deepam2: దీపే వారసురాలని కనిపెట్టిన దాస్.. నిజాన్ని అనసూయ తెలుసుకోగలదా?
on Nov 29, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం-2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-215 లో... దీపని వెతుక్కుంటూ దాస్ ఇంటికి వస్తాడు. దీప ఆప్యాయంగా ఆహ్వానిస్తుంది. నేను వెళ్లి కాంచనమ్మ గారిని పిలుస్తానంటూ దీప వెళ్తుండగా.. పర్వాలేదమ్మా.. అయినా నేను నా చెల్లెల్ని కలవడానికే రావాలా? నీ కోసం రాకూడదా అని దాస్ అంటాడు. అలా ఎందుకు అంటాను బాబాయ్.. ఈ రోజుల్లో ఆప్యాయంగా పలకరించే మనుషులు దొరకడమే ఎక్కువ అని దీప అంటుంది. అయితే అనసూయ అప్పటికే మరో గుమ్మం ముందు కింద కూర్చుని.. కుబేర్ ఫొటోకి ప్లాస్టర్ వేస్తూ ఉంటుంది. కుబేర్ ఫొటోని సగమే చూస్తున్న దాసు.. అది కుబేర్ ఫొటో అయ్యి ఉంటుందా? చూపించమని అడిగితే బాగోదు.. దీప ముందు అనసూయతో ఏం మాట్లాడలేను ఇప్పుడు ఎలా అని దాస్ అనుకుంటాడు. అమ్మా దీపా.. నలుగురికి వెలుగునిచ్చే పేరు నీది. ఈ పేరు నీకు ఎవరు పెట్టారమ్మా అని దాస్ అంటాడు.
మా అమ్మ పెట్టిందంట బాబాయ్ అని దీప అంటుంది. అవునా.. పోనీలే.. నీకు అంత మంచి పేరు పెట్టిన మీ అమ్మ నాన్నల పేర్లు ఏంటమ్మా అని దాస్ అంటాడు. మా అమ్మ పేరు అంబుజావల్లి, నాన్న పేరు కుబేరుడు, అంతా కుబేర్ అని పిలుస్తారని దీప అంటుంది. వెంటనే అనసూయ చేతిలోని ఫొటో దాసుకి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సీన్ అదిరిపోయింది. దాసుకి మరో అనుమానం వస్తుంది. మరి దీపకు తోబుట్టువులు ఉండి ఉంటే అని. వెంటనే.. అమ్మా నీకు తోబుట్టువులు ఎంత మంది అని దాస్ అడుగగా.. ఎవరూ లేరు బాబాయ్.. నేను ఒక్కదాన్నే అని దీప అంటుంది. అంటే.. దీపే వారసురాలు.. కానీ దీప కుబేర్ కూతురు కూడా అయ్యి ఉండొచ్చు కదా.. ఈ నిజాన్ని అనసూయనే అడగాలని దాస్ మనసులో ఫిక్స్ అవుతాడు. అమ్మా దీపా.. నాకు ఈ పక్క వీధిలో కొంచెం పని ఉంది. ఉంటానమ్మా అని కావాలనే తాను తెచ్చిన బ్యాగ్ అక్కడే వదిలేసి వెళ్లిపోతాడు. ఇంతలో అనసూయ ఫొటో తీసుకుని లోపలికి రావడం.. దీప.. దాసు మరచిపోయిన బ్యాగ్ చూడటం రెండూ ఒకేసారి అవుతాయి. నేను ఇచ్చి వస్తానులే దీపా అంటూ దాసు వెనుకే అనసూయ బయలుదేర్తుంది. అయితే దాసు గేట్ దగ్గరే కాపలాగా ఉంటాడు. అనసూయ బయటికి వస్తే బాగుండని అనుకున్నట్లే బ్యాగ్ తీసుకుని వస్తుంది అనసూయ.
మనం అనుకున్నదే జరిగింది. అనసూయ వస్తోందని కావాలనే ఎదురు వెళ్లిన దాస్.. అయ్యో బ్యాగ్ మరిచిపోయానంటూ అందుకుంటూ కావాలనే.. కుబేర్ డ్రాయింగ్ అనసూయ చూసేలా చేస్తాడు. కిందపడిన కుబేర్ డ్రాయింగ్ని అనసూయ చేతిలోకి తీసుకుని.. ఇది మా తమ్ముడు బొమ్మలా ఉందే.. మా తమ్ముడు బొమ్మే. ఎవరు గీశారు బాబు.. ఇది మీ దగ్గరుందేంటీ? అంటే మా తమ్ముడు మీకు ముందే తెలుసా? అంటూ ఆరా తీస్తుంది అనసూయ. తెలుసమ్మా అని దాస్ అంటాడు. మరి తెలిసినట్లు ఇంతకాలం ఎందుకు చెప్పలేదు బాబు అని అనసూయ అంటుంది. నేను చెప్పాలనుకుంటే చాలా విషయాలు చెప్పాలి.. నేను నోరు విప్పడం మంచిది కాదని ఆగిపోయానని దాస్ అంటాడు. ఇంతలో అక్కడికి జ్యోత్స్న వస్తుంది. అనసూయ, దాస్ మాట్లాడుకోవడం చూసిన జ్యోత్స్న.. వీళ్ళేం మాట్లాడుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవాలని అనుకుంటుంది. కాసేపటికి వారసురాలు దొరికిందని అనుకొని దాస్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరి దాస్ ఆ నిజాన్ని దీపకి చెప్తాడా? జ్యోత్స్న వెతుకుతున్న వారసురాలు దీపే అని తెలిస్తుందా లేదా తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read